లాక్‌డౌన్ ఎఫెక్ట్ : నా చావుకి పోలీసులే కారణం.. యువకుడి సెల్ఫీ..

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : నా చావుకి పోలీసులే కారణం.. యువకుడి సెల్ఫీ..
x
Highlights

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలానికి బయలుదేరిన క్రమంలో పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య...

లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలానికి బయలుదేరిన క్రమంలో పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిందీ ఘటన. కృష్ణా జిల్లా మండపల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన పేడాడ శ్రీనివాసరావు…చిత్తూరు జిల్లా నగరిలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కరోనా ప్ర‌భావంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తన టూ వీల‌ర్ పై మార్చి 31వ తేదీన నగరి నుంచి సొంతూరికి బయల్దేరాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గుంటూరు-ప్రకాశం జిల్లాల బోర్డ‌ర్ స్టూవర్టుపురం చెక్‌పోస్టు వద్దకు రాగానే వెదుళ్లపల్లి పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ ను సీజ్ చేసి యువకుడిపై కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే రోజు రాత్రి వ్యక్తిగత పూచీకత్తుపై శ్రీనివాసరావుని పోలీసులు విడిచిపెట్టారు.

శ్రీనివాసరావు కాలినడకన అక్కడినుంచి బాపట్ల బస్‌స్టాండ్‌కు చేరుకొన్నారు. స్వగ్రామానికి వె ళ్లేందుకు మార్గం కనిపించకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జ‌రిపించారు. అనంతరం బాడీని ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు అప్పగించారు. అయితే ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు తనతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని.. తన మరణానికి వెదుళ్లపల్లి పోలీసులే కారణమంటూ చనిపోయేముందు శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో గురువారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. మరోవైపు ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories