AP News:నిండు గర్బిణికి చికిత్స చేసి ఔదార్యం చాటుకున్న టీడీపీ అభ్యర్ధి

AP News: తల్లీతో పాటు పుట్టిన బిడ్డ క్షేమం

Shashank Gullapelli
Published on: 19 April 2024 8:56 AM IST
A TDP candidate who treated a pregnant woman and showed generosity
X

AP News:నిండు గర్బిణికి చికిత్స చేసి ఔదార్యం చాటుకున్న టీడీపీ అభ్యర్ధి 

AP News: పురిటి నొప్పులతో బాధపడుతూ డెలివరీ కష్టంగా ఉన్న ఓ నిరుపేద మహిళకు తానున్నానంటు ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముందుకు వచ్చి పండంటి బిడ్డకు ప్రాణం పోసింది.కురిచేడు మండలం అబ్బాయి పాలెంకు చెందిన వెంకట రమణ నిండు గర్భిణీ కావడంతో దర్శిలోని ఎస్ఎస్ఆర్ నర్సింగ్ హోం డాక్టర్లను ఆమె కుటుంబ సభ్యులు సంప్రదించారు. గర్బిణి పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు గర్బంలో బిడ్డ ఉమ్మనీరు తాగి బిడ్డ అడ్డంతిరిగిందని సురక్షితంగా డెలివరీ కావాలంటే వెంటనే మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని హాస్పిటల్ ను సంప్రదించాలని సూచించారు. దర్శిలోనే ఉన్న టీడీపీ అభ్యర్ధి డాక్టర్ లక్ష్మీని వెంకటరమరణ కుటుంబ సభ్యులు కలిసి తమ పరిస్థితి వివరించారు. వెంటనే ఎస్ఎస్ఆర్ హాస్పిటల్ కు వెల్లి గర్బిణికి వైద్య పరీక్షలు చేసి సురక్షితంగా డెలివరీ చేసింది. తల్లితో పాటు పుట్టిన పండంటీ బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story