Nandyala: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీ.. స్టూడెంట్స్‌కు నాణ్యమైన విద్య అందడం లేదని ఆగ్రహం

A Surprise Inspection By The Principal Secretary Of Education At Banaganapalle
x

Nandyala: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీ.. స్టూడెంట్స్‌కు నాణ్యమైన విద్య అందడం లేదని ఆగ్రహం

Highlights

Nandyala: వారంలో ఒకరోజు స్కూల్స్‌ను విజిట్ చేయాలని ఎంఈఓకు ఆదేశం

Nandyala: నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. కొండపేట ప్రాథమికోన్నత పాఠశాల, మూడవ సచివాలయం, జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ఆయన... విద్యార్థులను ప్రశ్నలు వేసి పుస్తకాలను పరిశీలించారు. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా విద్యార్థులు సమాధానం చెప్పకపోవడంతో.... వారికి నాణ్యమైన బోధన అందడం లేదని అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యాశాఖ అధికాలను నిలదీశారు. వారంలో ఒకరోజు పాఠశాలలను తనిఖీ చేయాలని ఎంఇఓను ఆదేశించారు. నాడు నేడు రెండవ దశ పనులను పరిశీలించిన ఆయన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories