Guntur: ఆత్మకూరులో చీటీల పేరుతో రూ. 40 కోట్ల టోకరా

Guntur: గుంటూరు జిల్లా ఆత్మకూరులో చీటీల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది

Sandeep Eggoju
Updated on: 8 Dec 2021 5:55 PM IST
A  Scam  in Atmakuru in Guntur district in the Chiti Business
X

 గుంటూరు జిల్లా ఆత్మకూరులో చీటీల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది

Guntur: గుంటూరు జిల్లా ఆత్మకూరులో చీటీల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. చీటీల వ్యాపారం పేరుతో 300 మంది దగ్గర 40 కోట్లు వసూలు చేశాడు వెంకటేశ్వర్లు. తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వడం వెంకటేశ్వర్లు వ్యాపారం. చీటీల సమయం ముగియడంతో డబ్బులు ఇవ్వాలని అడగడంతో వెంకటేశ్వర్లు పరారయ్యాడు.

దీంతో మోసపోయామని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో చీటీల కట్టామని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర్లు మోసంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story