Gudimetla: కష్టానికి ఫలితం దక్కిందోచ్.. అరుదైన వజ్రం లభ్యం.. ధర అన్ని లక్షలా..?

Gudimetla: కొన్నేళ్లుగా గుడిమెట్లలో సాగుతున్న వజ్రాల వేట

Shekhar G
Published on: 13 Aug 2023 4:21 PM IST
A Rare Diamond Was Found In Gudimetla Of The NTR District
X

Gudimetla: కష్టానికి ఫలితం దక్కిందోచ్.. అరుదైన వజ్రం లభ్యం.. ధర అన్ని లక్షలా..?

Gudimetla: ఎన్టీఆర్ జిల్లా నందిగామ గుడిమెట్లలో ఓ వ్యక్తికి అరుదైన వజ్రం దొరికింది. వజ్రానికి 6 కోణాలు ఉండటంతో షడ్బుజి వజ్రం కావడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. వజ్రం విలువ 50 లక్షల నుండి 60లక్షలు ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఆ వజ్రాన్ని వ్యాపారాలు 40 లక్షలకు బేరమాడుతున్నారు.

సత్తెనపల్లి దగ్గర బిగుబండ గ్రామానికి చెందిన కుటుంబానికి గుడిమెట్లలో వజ్రాల వేటలో ఈ వజ్రం దొరికింది. కాగా ఎన్నో ఏళ్లుగా గుడిమెట్లలో వజ్రాల వేట సాగుతోంది. గుడిమెట్లను గతంలో రాజులు పరిపాలించంతో ఇక్కడ వజ్రాలు దొరకడంతో వందలాది మంది వజ్రాల కోసం ఇక్కడికి వస్తున్నారు. మొన్న ఒక్కరోజే మూడు వజ్రాల దొరికాయని చెప్పడంతో గుడిమెట్లకు జనాల తాకిడి పెరిగింది.

Shekhar G

Shekhar G

Next Story