గాజువాక వరలక్ష్మి హత్యకేసులో కొత్త ట్విస్ట్

గాజువాక వరలక్ష్మి హత్యకేసులో కొత్త ట్విస్ట్
x
Highlights

గాజువాక వరలక్ష్మి హత్యకేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిమ్మకాయలు,...

గాజువాక వరలక్ష్మి హత్యకేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ప్రాంతంలో క్షుద్రపూజల ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిమ్మకాయలు, పసుపు, కోడిగడ్డుతో పూజలు చేశారు. హత్య కూడా సరిగ్గా పౌర్ణమి రోజే జరగడంతో పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే క్షుద్రపూజలు జరిగాయా, విషయం డైవర్ట్ చేసేందుకు క్షుద్రపూజల నాటకం ఆడుతున్నారా వరలక్ష్మి హత్య కేసులో అసలేం జరుగుతోంది. హత్యకు క్షుద్రపూజలకు లింకెంటి.?

హత్య జరిగిన ప్రాంతాన్ని మహిళా సంఘాలు పరిశీలించాయి. ఆ ప్రదేశంలో వారికి క్షుద్రపూజల జరిగినట్లు స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో వారు క్షుద్రపూజల కోణంలో సైతం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సైతం క్షుద్రపూజల ఆనవాళ్లను పరిశీలించి, క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.

వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్‌ను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అఖిల్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అఖిల్‌ను సెంట్రల్‌కు జైల్‌కు తరలించారు. వరలక్ష్మి కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి సుచరిత పరామర్శించారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories