Rajahmundry: రాజమండ్రి ఆనంద్‌నగర్‌లో దారుణం

*ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపిన తల్లి *మృతి చెందిన కుమార్తె చిన్మయి, కుమారుడు మోహిత్‌ *ఓ వ్యక్తితో లక్ష్మీ అనూష సహజీవనం

Shilpa
Published on: 11 Oct 2021 10:38 AM IST
A Mother Hanging two Children in Anandnagar Rajahmundry
X

రాజమండ్రి ఆనంద్‌నగర్‌లో దారుణం(ఫైల్ ఫోటో)

Rajahmundry: రాజమండ్రి ఆనంద్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లి ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసింది. సహజీవనానికి అడ్డు ఉన్నారని కన్నబిడ్డలను హత్య చేసింది. 13 ఏళ్ల క్రితం తాడేపల్లికి చెందిన వ్యక్తితో లక్ష్మీ అనూషకు వివాహం అయ్యింది. ఐదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో రాజమండ్రి వచ్చి బ్యూటీషియన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంది. కొద్ది రోజుల క్రితం మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి సహజీవనం వరకు వెళ్లింది. అయితే తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేసింది. పిల్లలను చంపేసిన అనంతరం ప్రియుడికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story