Srikakulam: సముద్రంలో వేటకు వెళ్లి పడవ కిందపడి వ్యక్తి మృతి

Srikakulam: అలలు తాకిడికి బోల్తా పడిన పడవ

Shekhar G
Published on: 9 July 2023 9:54 AM IST
A Man Died After His Boat Fell While Hunting In The Sea
X

Srikakulam: సముద్రంలో వేటకు వెళ్లి పడవ కిందపడి వ్యక్తి మృతి

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కవిటి మండలం కపాశకుద్ది గ్రామానికి చెందిన బడే డిల్లేసు సముద్రంలో వేటకు వెళ్లి పడవ బోల్తా పడి మృతి చెందాడు. ప్రతిరోజు వేటకు వెళ్ళినట్టే ఆదివారం వేకువ జామున మరో నలుగురితో కలిసి సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. వేటకు వెళ్లే కొద్ది సమయానికి అలలు తాకిడికి పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో డిల్లీసు పడవ కింద చిక్కుకొని మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. డిల్లీసు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story