Nellore: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

A Lorry Hit An RTC Bus
x

Nellore: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

Highlights

Nellore: లారీ డ్రైవర్‌కు గాయాలు.. అప్రమత్తంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్

Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిక వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టసీ బస్సు కడప నుంచి నెల్లూరు వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. పొగ మంచు అధికంగా కురవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories