Kadambari Jethwani Case: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం

Kadambari Jethwani Case: కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Sept 2024 7:46 PM IST
Kadambari Jethwani Case
X

Kadambari Jethwani Case: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం

Kadambari Jethwani Case: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు.ముగ్గురు ఐపీఎస్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఏ3, ఏ4, ఏ5గా ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ ఉన్నారు. కీలక నిందితుడు విద్యాసాగర్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విద్యాసాగర్‌కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. జెత్వానీ కేసులో ఏ1గా ఉన్న విద్యాసాగర్, జెత్వానీ కేసును గతంలో దర్యాప్తు చేసిన అధికారి సత్యనారాయణ ఏ2గా ఉన్నారు.

విద్యాసాగర్‌ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టులో కాంతిరాణా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి వరకు కాంతిరాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story