అల్లూరి జిల్లాలో తప్పిన ప్రమాదం.. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన బస్సు

Bus Fire: ప్రమాదసమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు

Jyothi
Published on: 28 Nov 2022 10:37 AM IST
A Fire Broke Out in a Private Travel Bus at Alluri District
X

అల్లూరి జిల్లాలో తప్పిన ప్రమాదం.. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన బస్సు

Bus Fire: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. అరకు రెండో ఘాట్‌ రోడ్డు వద్ద ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది బస్సు. ప్రమాదసమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. విజయనగరం జిల్లా చిల్లూరు నుంచి పర్యాటకులతో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story