Kadapa: పోలీసులు వేధిస్తున్నారంటూ కడప జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆవేదన
Kadapa: దువ్వూరు మండలంలోని ఒకటిన్నర ఎకరం భూమిని వైసీపీ నేతలు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆరోపణ
పోలీసులు వేధిస్తున్నారంటూ కడప జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆవేదన
Kadapa: పోలీసులు వేధిస్తున్నారంటూ కడప జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దువ్వూరు మండలంలోని తమ ఒకటిన్నర ఎకరం భూమిని వైసీపీ నేతలు బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని, దీనికి మైదుకూరు రూరల్ సీఐ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై సీఐ తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది బాధిత కుటుంబం. సీఎం జగన్ తమను కాపాడాలంటూ బాధితుడు అక్బర్ బాషా కండతడి పెట్టుకున్నాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు అక్బర్ బాషా.
Next Story




