జీఎన్‌‌రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ.. సమావేశంలో చర్చకు వచ్చిన రాజధాని రైతుల ఆందోళన ?

జీఎన్‌‌రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ.. సమావేశంలో చర్చకు వచ్చిన రాజధాని రైతుల ఆందోళన ?
x
జీఎన్‌‌రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ
Highlights

జీఎన్ రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్ చర్చిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తిరిగి ఆయా ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా నివేదిక...

జీఎన్ రావు కమిటీ నివేదికపై ఏపీ కేబినెట్ చర్చిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తిరిగి ఆయా ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలకు అనుగుణంగా నివేదిక ఇచ్చినట్టు పలువురు మంత్రులు అన్నారు. నూతనంగా రాష్ట్రం ఏర్పడినందున పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు సూచించినట్టు సమాచారం.

అయితే రాజధాని రైతుల ఆందోళన కూడా చర్చకు వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన హామికి అనుగుణంగా రైతులకు ఇవ్వాల్సిన వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని పలువురు కోరినట్టు సమాచారం. పరిపాలన వికేంద్రీకరణ విషయంలో మరింత అధ్యయనం అవసరమని సీనియర్ మంత్రులు సూచించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories