Puthalapattu: పూతలపట్టు ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు

Puthalapattu: లైంగికంగా వేధించారంటూ నలుగురు మహిళల ఫిర్యాదు

Shekhar G
Published on: 20 Jun 2023 2:09 PM IST
A Case Has Been Registered Against Puthalapattu SI And Five Constables
X

Puthalapattu: పూతలపట్టు ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు

Puthalapattu: పూతలపట్టు ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. తమనులైంగికంగా వేధించారంటూ ఎస్పీకి నలుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో పూతలపట్టు ఎస్ఐ, మరో ఐదు గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన ఆరుగురు మహిళల్ని చోరికి పాల్పడ్డారనే అనుమానంతో పూతలపట్టు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో ఇద్దరు పాతనేరస్థులు కావడంతో వారిని రిమాండ్‌కు పంపించారు. మిగిలిన నలుగురికి నోటీసులిచ్చి పంపించారు. తరువాత వారు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫోన్ చేసి పూతలపట్టు ఎస్ఐతో పాటు మరో ఐదుగురు తమను లైంగి‌కంగా వేధించారని ఫిర్యాదు చేశారు. దీంతో చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఎస్ఐ, సీఐలను బదిలీచేశారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారించడానికి ఏఎస్పీ సుధాకర్ ని విచారణ అధికారిగా నియమించారు.

Shekhar G

Shekhar G

Next Story