నెల్లూరు జిల్లాలో కారులో మంటలు.. నాయుడుపేట జాతీయ రహదారిపై దగ్ధమైన కారు

నెల్లూరు జిల్లాలో కారులో మంటలు వ్యాపించాయి. నాయుడుపేట జాతీయరహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Sandeep Eggoju
Published on: 13 Dec 2021 7:22 AM IST
A Car Fire Accident in the Nellore District
X

నెల్లూరు జిల్లాలో కారులో మంటలు

Nellore: నెల్లూరు జిల్లాలో కారులో మంటలు వ్యాపించాయి. నాయుడుపేట జాతీయరహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న రామయ్య ఆయన సతీమణి మాధవి,నాలుగేళ్ల చిన్నారి సురక్షితంగా బయట పడ్డారు. చెన్నై నుంచి కారులో విజయవాడకు వెళ్తుండగా మార్గమధ్యంలో నాయుడుపేట జాతీయ రహదారిపై కి రాగానే కారులో నుంచి ఆయిల్ వాసన రావడంతో కారు నడుపుతున్న రామయ్య రోడ్డు పక్కగా నిలిపి ముగ్గురు కార్ లో నుంచి బయటికి వచ్చేశారు. వారు బయటికి వచ్చిన వెంటనే కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోపు కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కారు ఫోర్డ్ ఎకో స్పోడ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story