Anantapur: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బొలెరో.. 26 గొర్రెలు మృతి

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గొర్రెల మందపై బొలేరో వాహనం దూసుకెళ్లింది.

Shekhar G
Published on: 18 Jan 2024 6:39 PM IST
A Bolero Vehicle Rammed Into A Herd Of Sheep Killing 26 Sheep
X

Anantapur: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన బొలెరో.. 26 గొర్రెలు మృతి

Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గొర్రెల మందపై బొలేరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన రైతు మారెప్ప తన గొర్రెల్ని మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి తీసుకువెళుతుండగా గాగూబనపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బొలోరా వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ రోడ్డు పక్కన వాహనాన్ని వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్టు గొర్రెల కాపరి తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుంచి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story