Kakinada: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బోటు ప్రమాదం

Kakinada: ఓడ్డుకు సమీపంలో తిరగబడిన బోటు * సురక్షితంగా బయటపడిన ఆరుగురు మత్స్యకారులు

Sandeep Eggoju
Updated on: 24 Jun 2021 1:27 PM IST
A Boat Capsized in East Godavari District Kakinada
X

కాకినాడ లో బోట్ బోల్తా (ఫైల్ ఇమేజ్)

Kakinada: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బోటు ప్రమాదానికి గురైంది. యు. కొత్తపల్లి మండలం మాయపట్నానికి చెందిన బోటు ఒడ్డుకు సమీపంలో తిరగబడింది. చేపల వేటకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బోటులో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. సమీపంలో ఉన్న తోటి మత్స్యకారుల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి నీట మునిగిన బోటును ఓడ్డుకు చేర్చారు. అయితే.. అప్పటికే బోట్‌లో ఉన్న లక్ష రూపాయల చేపలు సముద్రం పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story