Gannavaram: కంట్రోల్ రూమ్ లోకి చొరబడ్డ బిచ్చగాడు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు

Gannavaram: కంట్రోలర్ సీటులో కూర్చున్న బిచ్చగాడు

Shekhar G
Published on: 10 Oct 2023 1:51 PM IST
A Beggar Broke Into The Control Room In Gannavaram
X

Gannavaram: కంట్రోల్ రూమ్ లోకి చొరబడ్డ బిచ్చగాడు.. తీవ్ర ఇబ్బందులుపడ్డ ప్రయాణికులు

Gannavaram: కృష్ణా జిల్లా గన్నవరం బస్టాండ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. ఏపీయస్ ఆర్టీసీ బస్టాండ్ కంట్రోల్ రూమ్ లోకి బిచ్చగాడు చొరబడ్డాడు. అంతే కాదు కంట్రోలర్ సీటులో దర్జాగా కూర్చున్నాడు. సమాచారం అండిగేందుకు వెళ్లిన ప్రయాణికులు బిచ్చగాడ్నిచూసి ఖంగుతిన్నారు. బిచ్చగాడు ఉదయం నుంచి రాత్రి వరకూ అక్కడే కూర్చున్నా ఆర్టీసీ అధికారులెవరూ పట్టించుకోలేదు. బస్సులకు సంబంధించి ఎవరిని సమాచారం అడగాలో తెలియక అనేక ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. నిత్యం వివిధ ప్రాంతాలకు వేల మంది ఈ బస్టాండ్ మీదుగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం పై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story