ఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు నమోదు

Arun Chilukuri
Published on: 11 Sept 2020 5:57 PM IST
ఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు నమోదు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 9,999 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,137 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,999 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 77 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. గడిచిన 24 గంటల్లో ఏపీలోని కడప జిల్లాలో 9, చిత్తూరు 8, నెల్లూరు 8, ప్రకాశం 8, గుంటూరు 7, కృష్ణా 7, అనంతపురం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమ గోదావరి 5, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 3, కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5,44,791. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,779. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,43,821కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 96,191 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 71,137 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకూ ఏపీలో 44లక్షల 52,128 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story