AP Corona Cases: రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు..24 గంటల్లో 51 మరణాలు

AP Corona Cases: ఏపీలో రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 26 April 2021 8:43 PM IST
9881 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 26 April 2021
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

AP Corona Cases: ఏపీలో రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రాష్ట్రంలో 9 వేల 881 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ కారణంగా 51 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య పది లక్షల 43 వేల 441కి చేరింది. మరణాలు 7 వేల 7 వందల 36కి చేరాయి.

ఇక ‌తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 15 వందల 92 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 13 వందల 02, గుంటూరులో 10 వందల 48 కేసులు వచ్చాయి. ఇక కోవిడ్‌తో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 6చొప్పున మృతి చెందారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 5గురి చొప్పున, అంనతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో 4గురి చొప్పున మృతి చెందారు.

Venkata Chari

Venkata Chari

Next Story