AP Corona Cases: ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 21 April 2021 6:48 PM IST
9,716 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 21 April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య వేగంగా 10వేలకు పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 9వేల 716 మందికి కరోనా సోకగా వైరస్‌ బారిన పడి 38 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 86 వేల 703కు చేరింది. కరోనా నుంచి 9లక్షల 18వేల 985 మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 60వేల 208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన మరణాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7వేల 510 కి పెరిగింది. కరోనా బారిన పడి అత్యధికంగా కృష్ణా జిల్లాలో 10మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరులో 7 మంది, తూ.గో.జిల్లాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృతి చెందారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story