హ్యాట్సాఫ్ ప్రొఫెసర్ శాంతమ్మా: 94 ఏళ్ల వయసులో 140 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ

95-Year-old Professor Santhamma Never Stopped Teaching
x

హ్యాట్సాఫ్ ప్రొఫెసర్ శాంతమ్మా: 94 ఏళ్ల వయసులో 140 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ

Highlights

30 ఏళ్లకే షుగర్, బీపీ, గుండెజబ్బులు వస్తున్న రోజులివి.

Professor Santhamma Inspiring Story: 30 ఏళ్లకే షుగర్, బీపీ, గుండెజబ్బులు వస్తున్న రోజులివి. 50 ఏళ్లు దాటాయంటే ఇక మిగిలిన జీవితం బోనస్‌ అని సంతోషిస్తున్న కాలం అందుకే ఉద్యోగం నుంచి రిటైర్‌ అయితే మనవళ్లు, మనవరాళ్లతో ఆటలు ఆధ్యాత్మిక చింతనలోనో శేషకాలం గడిపేస్తుంటారు. కానీ ఆమె మాత్రం అలాంటి ధ్యాసే లేదంటోంది. ఊపిరి ఉన్నంత వరకు తనపని తానే చేసుకుంటానంటోంది తనకున్న విజ్ఙానం పది మందికి పంచుతానంటోంది. 95 ఏళ్ల వయస్సులో అలుపు సొలుపు లేకుండా 4గంటలు డ్యూటీ చేస్తూ ఔరా అనిస్తోంది. ఎవరామె ఇంతకీ ఆమె ఏం చేస్తున్నారు.

చదువుకి వయసుతో సంబంధం లేదు. 9 పదుల వయసులోనైనా చదువుకోవచ్చు లేదంటే చదువు చెప్పొచ్చు. దీనికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది ఓ సీనియర్ రిటైర్డ్ ఫ్రొఫెసర్. పనిచేయాలన్న తపన పదిమందిని ఉన్నత స్థితికి తీసుకురావాలన్న ఆశయం ఉంటే వయ్యస్సు అడ్డురాదని నిరూపించారు 94 యేళ్ళ శాంతమ్మ తొమ్మిది పదుల వయసులోనూ 140 కిలోమీటర్లు ప్రయాణించి సెంచురియన్ యూనివర్సిటిలో ఫిజిక్స్ పాఠాలు చేబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్‎పై hmtv ప్రత్యేక కధనం.

ఈపెద్దావిడ పేరు శాంతమ్మ కృష్టా జిల్లా మచిలిపట్నంలో పుట్టి వృత్తిరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. 1929 మార్చి 8న జన్మించిన చిలుకూరి శాంతమ్మ వయస్సు అక్షరాల 94 ఏళ్లు ఈ వయస్సులో మోకాళ్ల నొప్పులు సహజమే కదా అయినా ఆపరేషన్ చేయించుకుని ఆమె చేతి కర్రల సాయంతో నడక సాగిస్తున్నారు. మరి చేతి కర్రలు పట్టుకుని మరీ ఈమె ఎక్కడకు వెళ్తున్నారు ఏ ఆసుపత్రికో అనుకుంటున్నారా..? కాదు.. ఎక్కడికో మీరే చూడండి. అవును మీరు చూస్తున్నది నిజమేశాంతమ్మ వెళ్లింది యూనివర్సిటీ తరగతిగదిలోకే విజయనగరంలోని సెంచూరియన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్ శాంతమ్మ.. ఈతరం ప్రొఫెసర్లకు ధీటుగా పాఠాలు చెబుతూ ఔరా అనిపించుకుంటున్నారు. 94 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం చేస్తారు. కృష్ణా రామ అంటూ శేష జీవితాన్ని గడిపేస్తారు. కానీ ప్రొఫెసర్‌ శాంతమ్మ తాను ఆటైపు కాదంటోంది. తన శరీరంలో సత్తువ ఉన్నంత వరకు తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడమే ఆమె లక్ష్యమంటోంది. అందుకే 94ఏళ్ల వయసులోనూ ఆమె విజయనగరంలోని సెంచురియన్ యూనివర్సీటిలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నిజానికి శాంతమ్మ 1989లోనే పదవి విరమణ పొందారు. అయినప్పటికీ ఆమె ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ‎మళ్లీ ఏయూలోనే గౌరవ అధ్యాపకురాలిగా సేవలు అందించారు. ఇప్పుడు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. 94 ఏళ్ల వయసులో రోజూ అంత ప్రయాణం చేయడం చాలా కష్టమే అయినా వాటిని లెక్క చేయకుండా ఆమె విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

అసలు ఎవరీ శాంతమ్మ ఆమె బయోగ్రఫీ ఏంటి..? విద్యాభ్యాసం, ఎన్నాళ్ల నుంచి ఇలా పాఠాలు బోధిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పడు తెలుసుకుందాం.

విశాఖకు చెందిన చిలుకూరి శాంతమ్మ. విద్యాభ్యాసమంతా రాజమండ్రి విశాఖలో కొనసాగింది. భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వైజాగ్ ‎లోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చేసిన శాంతమ్మ ఆంధ్రావర్శిటీలో హనర్స్, ఎంఎస్సీ చదివారు. పరిశోధన తర్వాత 1956లో పిజిక్స్ లెక్చరర్‎గా జాయిన్ అయ్యారు. ఆనాటి నుండి పలు విభాగాలలో విధులు నిర్వర్తించిన ఆమె 1989లో పదవి విరమణ పొందారు. ఇంకా విద్యార్దులకు భోదించాలన్న తపనతో ఆంద్రా యూనివర్సిటిలో గౌరవ అద్యపకురాలుగా చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ శాంతమ్మ బోధన, పరిశోధన నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నారు ప్రొఫెసర్ శాంతమ్మ.

అంతేకాదు ప్రొఫెసర్ శాంతమ్మ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. వృత్తిలో భాగంగా యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యారు. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు 12 మంది విద్యార్థులు ఆమె పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ వయసులో రిసెర్చ్ చేస్తూ, భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలపై రెండు పుస్తకాలు రాస్తున్నారు.

తన ప్రియ శిష్యుడు మాజీ ఆంద్రా యూనివర్సిటి వైస్ చాన్సలర్ జిఎస్ఎన్ రాజు కోరిక మేరకు ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటిలో రిజైన్ చేసి గత ఆరు సంవత్సరాలుగా సెంచూరియన్ యూనియర్సిటిలో పాఠాలు బోదిస్తున్నారు. అలా ప్రస్తుతం ప్రతీరోజూ విశాఖపట్నంలో ఉదయం 9గంటలకు భయలుదేరి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి విజయనగరంలోని సెంచూరియన్ యూనియర్సిటిలో పిజిక్స్ బోదిస్తున్నారు. వయోభారం పడుతున్నా వెనకడుగు వెయ్యకుండా ప్రతీరోజు క్రమం తప్పకుండా కాలేజీకి వస్తూ పాఠాలు చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

9 పదుల వయస్సులో ప్రొఫెసర్ శాంతమ్మకు ఇదంతా ఎలా సాధ్యమవుతోంది. మాట అనుకున్నంత ఈజీ కాదు ఏదైనా పనిని అనుకున్న టైమ్ కి పూర్తి చేయడమంటే కష్టమే అలాంటిది 94 ఏళ్ల వయసులో ఆమెకెలా సాధ్యమవుతోంది.? పట్టుదల ఉంటే సాధించలేని ఏమీ లేదనేది ఈ ప్రొఫెసర్ శాంతమ్మను చూస్తే నిజమనే అనిపిస్తోంది. వయోభారంతో సంబంధం లేకుండా తన అనుభవాన్ని అంతా ఈ తరం పిల్లలకు చెప్పాలన్న ఆమె తప్ప వయోభారాన్ని, ఇబ్బందులను అధిగమించేలా చేస్తోంది.

తాను చిన్నప్పటినుంచి కష్టపడి పైకొచ్చానంటున్న ప్రొఫెసర్ శాంతమ్మ ఏవిషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. ప్రతి ఆందోళనకు మానసిక ప్రశాంతత లేకపోవడమే కారణం అంటున్నారు. అందుకే ఇతరులు చెప్పే నెగెటీవ్ మాటలు, ఓ పని అవుతుందో కాదో అన్న ఆందోళనకు తాను దూరంగా ఉంటానంటున్నారు. "మనలో చాలా మంది ఉన్న సమయాన్ని చాలా విషయాలపై కేంద్రీకరిస్తారనీ అది సరైనది కాదంటున్నారు. ఏదో ఒక విషయంపై దృష్టి పెట్టాలంటున్నారు. అలాగే మనలో ఉన్న ఎనర్జీని అనవసరమైన విషయాలతో వృధా చేసుకోవద్దంటారు. తాను అలాంటి ఆందోళనలేమీ పెట్టుకోంకుండా మానసిక ప్రశాంతతో ఉంటాను కాబట్టే ఈస్థాయికి చేరానని చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే తన ఇంట్లో ఆరుగురికి వంటకూడా తానే చేసి పెడతానని చెబుతోంది శాంతమ్మ. తనకున్న అనుభవాన్ని అంతా ఈ తరం పిల్లలకు చెప్పాలన్నదే తనకోరికంటున్న శాంతమ్మ ఎంత కష్టమైనా పాఠాలు చెప్పడం మానను అంటున్నారు. ఊపిరి ఉన్నంత వరకు తనకున్న విజ్ఞానాన్ని పంచుతానంటోంది శాంతమ్మ.

94 ఏళ్ల వయసులో ప్రొఫెసర్ శాంతమ్మ వైజాగ్ నుంచి విజయనగరం 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ పాఠాలు బోధించడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాను కూడా శాంతమ్మ శిష్యుడినే అంటున్నారు సెంచురియన్ యూనివర్సీటి వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు. మా గురువు శాంతమ్మ బ్రిటన్ రాయల్ సొసైటీలో డాక్టర్ ఆఫ్ సైన్స్ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. స్పెక్ట్రోస్కోపీలో రిసెర్చ్ చేసి లాబోరేటరీలను డెవలప్ చేశారని చెబుతున్నారు. తాను చదువుకునే రోజునుంచి కూడా ప్రొఫెసర్ శాంతమ్మ అంటే టైమింగ్.. టైమింగ్ అంటే ప్రొఫెసర్ అన్న భావన నేటికీ నిరూపించుకుంటోందంటున్నారు. ప్రొఫెసర్ శాంతమ్మ సబ్జెక్లు విశ్లేషణలో ధిట్ట అని చెబుతున్నారు. ఆమె తమ యూనివర్సిటీలో ఉంటం అధృష్టం అంటున్నారు. ఎన్నో బుక్స్, రాసి, 94 ఏళ్ల వయసులో అనర్గలంగా పాఠాలు బోధిస్తున్న తన గురువు ఫ్రొఫెసర్ శాంతమ్మ పేరును గిన్నిస్‌బుక్‌ వాళ్లకు సూచిస్తానని చెబుతున్నారు వీసీ

ఇక 94 ఏళ్ల వయసులో కూడా స్టూడెండ్స్ ను ఎంకరేజ్ చేస్తూ పాఠాలు చెప్పడం ప్రొఫెసర్ శాంతమ్మ స్పెషల్ అని అంటున్నారు సెంచురియన్ యూనివర్సిటీ విద్యార్థులు తొలుత ఈ పెద్దావిడ ఏం చెబుతుందో అనుకున్నాము కానీ ఓసారి మేడమ్ క్లాస్ విన్నాక ఇంకా వినాలన్న భావన కలిగిందని చెబుతున్నారు. అంతేకాదు ప్రొఫెసర్ శాంతమ్మతో ఇంటరాక్షన్ షెషన్స్ చాలా సరదాగా ఉంటాయంటున్నారు ఇక్కడి స్టూడెంట్స్. టీచింగ్‎లో అనుభవజ్ఞులు కావడంతో టఫ్ సబ్జెక్టు నుసైతం ఈజీగా అర్థం చేసుకునేతా ఎక్స్ ప్లేయిన్ చేస్తారని చెబుతున్నారు.

ప్రొఫెసర్ శాంతమ్మ 94 ఏళ్ల వయసులోనూ అలోవకగా సబ్జెక్ట్ అర్థం చేయిస్తూనే ఎన్నిసార్లు డౌట్ అడిగిన విసుక్కోకుండా చెబుతారంటున్నారు వర్సిటీ విద్యార్థులు. అంతేకాదు ఖాళీ సమయాల్లో "ప్రొఫెసర్ శాంతమ్మతో సరదాగా కూర్చుని మాట్లాడితే భలే టైమ్‎పాస్ అవుతుందంటున్నారు. తమతో చాలా జోవియల్‎గా ఉంటారని చెబుతున్నారు. అంతేకాదు ఆమె ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్ లో విద్యార్థులకు ఎలాంటి సందేహాలు అడిగినా వివరిస్తారంటున్నారు. "అన్నింటికి మించి క్లాసులోకి వచ్చిన తర్వాత ఎక్కువ సేపు బోర్డు దగ్గర నిలబడి రకరకాలైన అప్టిక్స్ స్ట్రక్చర్స్ గీస్తూ పాఠాలు చెప్తారంటున్నారు . చాక్ పీసుతో చకచక బోర్డుపై డ్రాయింగ్ గీసేస్తూ చెప్తూంటే చాలా సార్లు తామే ఆశ్చర్యపోతామంటారు ఇక్కడి విద్యార్థులు.

95 ఏళ్ల వయస్సులోనూ శాంతమ్మ బోధన కొనసాగించడం విశేషమైతే ఇప్పటికీ ఆమెకు మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం మరో అద్బుతం. అంతేకాదు పాఠాలతో పాటు జీవితానుభవాలను విద్యార్ధులకు పంచి స్ఫూర్తి కలిగిస్తున్నారామె. మరో విశేషం ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద వయస్సు ప్రొఫెసర్‌గా గిన్నిస్‌ బుక్‌ కూడా ఎక్కబోతున్నారు శాంతమ్మ. ఈనేపథ్యంలో hmtv తరపున ఆల్ ద బెస్ట్ చెబుతూనే... హ్యాట్సప్ ప్రొఫెసర్ శాంతమ్మా.


Show Full Article
Print Article
Next Story
More Stories