Kadapa: కడప జిల్లాలో విషాదం.. అదృశ్యమైన బాలుడు మృతి

* బాలుడి మృతిపై అనుమానాలు * రాజుపాలెం మండలంలోని వెంగలాయపల్లెలో ఈనెల 7న తనీష్‌రెడ్డి అనే బాలుడు మిస్సింగ్

Sandeep Reddy
Updated on: 10 Aug 2021 11:56 AM IST
9 Years Boy Missing and Lost his Life in Rajupalem Mandal Kadapa District
X

Kadapa: కడప జిల్లాలో విషాదం.. అదృశ్యమైన బాలుడు మృతి

Kadapa: క‌డ‌ప జిల్లా రాజుపాలెం మండలం వెంగ‌లాయ‌ప‌ల్లెలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 7న అదృశ్యమైన తొమ్మిదేళ్ల బాలుడు త‌నీష్‌ శ‌వ‌మై తేలాడు. దీంతో గ్రామంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. గ‌త శ‌నివారం సాయంత్రం నుంచి త‌మ కుమారుడు క‌నిపించ‌డ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం వెతికారు. దీంతో అదే రోజు రాజుపాళెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు త‌ల్లిదండ్రులు.

అయితే రెండు రోజుల వ్యవ‌ధిలోనే అదృశ్యమైన బాలుడు అదే గ్రామంలో శ‌వ‌మై క‌నిపించ‌డంతో ఆందోళ‌న‌కు గురిచేసింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌న్న విష‌యం పై అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆదివారం అమావాస్య రావడం క్షుద్రపూజల కొసం నరబలి ఇచ్చారన్న ప్రచారం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story