ఏపీలో కొత్తగా 8,835 కరోనా పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 16 Sept 2020 5:51 PM IST
ఏపీలో కొత్తగా 8,835 కరోనా పాజిటివ్ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,835 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75,013 శాంపిల్స్‌ని పరీక్షించగా 8,835 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,845 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, నెల్లూరు 7, గుంటూరు 6, ప్రకాశం 6, అనంతపురం 5, కడప 5, కృష్ణా 4, తూర్పుగోదావరి 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5,89,865. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,105. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,94,481కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 90,279 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 48,06,879 నమూనాలను పరీక్షించారు.







Arun Chilukuri

Arun Chilukuri

Next Story