AP Corona Cases: ఏపీలో కొత్తగా 8,766 కొవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 8వేల 766 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 9 Jun 2021 7:31 PM IST
8766 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 09 06 2021
X

కరోనా టెస్ట్ రిజల్ట్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 12 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93,511 శాంపిల్స్‌ పరీక్షించగా, 8 వేల 766 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 67 మంది మృతి చెందారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 79 వేల 773కు చేరగా ఇప్పటివరకు 11 వేల 696 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 12,292 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష03 వేల 995 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 1980 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరంలో 265 కేసులు నమోదయ్యాయి.



Venkata Chari

Venkata Chari

Next Story