AP Corona Cases: ఏపీలో కొత్తగా 8239 కరోనా కేసులు, 61మంది మృతి

AP Corona Cases: ఏపీలో కొత్తగా 8వేల 239 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 11 Jun 2021 6:15 PM IST
8239 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 11 06 2021
X

కరోనా టెస్ట్‌ రిజల్ట్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా మరణాలు మాత్రం కంట్రోల్‌లోకి రావడం లేదు. ఇప్పటికీ రోజుకి అరవై డబ్బై మంది కరోనాతో మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా 67మంది కరోనాకు బలైపోయారు. దాంతో, ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11వేల 696కి పెరిగింది. గడిచిన 24గంటల్లో 93వేల 511 పరీక్షలు నిర్వహించగా 8వేల 766 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 3వేల 995 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

ఏపీలో కరోనా మృత్యు ఘోష కొనసాగుతున్నప్పటికీ, గతంతో పోలిస్తే మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇక, గత 24గంటల్లో చిత్తూరులో 11మంది.... తూర్పుగోదావరిలో ఏడుగురు.... విశాఖలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.... అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. ఇక, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో నలుగురు చొప్పున.... ప్రకాశంలో ముగ్గురు.... కడపలో ఇద్దరు.... నెల్లూరు ఇద్దరు కరోనాకు బలైపోయారు.

Venkata Chari

Venkata Chari

Next Story