Coronavirus Updates in AP: ఏపీలో మరో 812 కరోనా పాజిటివ్ కేసులు
812 new coronavirus cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 812 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14285 శాంపిల్స్‌ని పరీక్షించగా 812 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 281 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 13,625. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 198. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5868కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 7,559 మంది చికిత్స పొందుతున్నారు.
Next Story




