AP Corona Cases: ఏపీలో కొత్తగా 8,110 కొవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 8వేల 110 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 10 Jun 2021 5:22 PM IST
8110 ‍New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 10 06 2021
X

కరోనా టెస్ట్ రిజల్ట్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 12 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 97,863 శాంపిల్స్‌ పరీక్షించగా, 8 వేల 110 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 67 మంది మృతి చెందారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 84 వేల 988కు చేరగా ఇప్పటివరకు 11 వేల 763 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 99వేల 057 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది కరోనాతో మరణించారు. ఇక తూర్పు గోదావరిలో అత్యధికంగా 1416 కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరులో 1042, అనంతపూరంలో 906 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలులో 235 కేసులు నమోదయ్యాయి.



Venkata Chari

Venkata Chari

Next Story