ఏపీలో కొత్తగా 7,956 పాజిటివ్ కేసులు.. 60 మరణాలు

Arun Chilukuri
Published on: 14 Sept 2020 6:13 PM IST
ఏపీలో కొత్తగా 7,956 పాజిటివ్ కేసులు.. 60 మరణాలు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 7,956 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,529 శాంపిల్స్‌ని పరీక్షించగా 7,956 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,764 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురం 7, కర్నూలు 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి 4, కడప 4, కృష్ణా 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, పశ్చిమగోదావరి 4, నెల్లూరు 3, గుంటూరులో ఇద్దరు మరణించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 5,72,184. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,972. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,74,008కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 93,204 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 46,61,355 కరోనా శాంపిల్స్ కు పరిక్షలు నిర్వహించింది ప్రభుత్వం.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story