AP Corona Cases: ఏపీలో కొత్తగా 7,943 కొవిడ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 7వేల 943 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Updated on: 31 May 2021 6:15 PM IST
7943 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 31 05 2021
X

ఆంధ్రప్రదేశ్‌లో నేడు 7,943 కొవిడ్ కేసులు నమోదయ్యాయి(ఫొటో ట్విట్టర్) 

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 8 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 83,461 శాంపిల్స్‌ పరీక్షించగా, 7 వేల 943 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 98 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షల 93 వేల 085కు చేరగా ఇప్పటివరకు 10 వేల 930 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 19,845 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 1 లక్ష53 వేల 795 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ చిత్తూరులో అత్యధికంగా 15మంది మృతి చెందగా, పశ్చిమగోదావరి 12, ప్రకాశం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 8, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 7, కృష్ణా 6, కర్నూలు 6, విజయనగరం 6, గుంటూరు 4, నెల్లూరు 4, కడపలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కాగా, తూర్పు గోదావరిలో అత్యధికంగా 1877 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 1283, గుంటూరులో 765 కేసులు నమోదయ్యాయి.


Venkata Chari

Venkata Chari

Next Story