CM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు

Aarogyasri Scheme: వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Arun Chilukuri
Updated on: 17 Aug 2022 9:30 PM IST
754 Procedures included in Aarogyasri Scheme
X

CM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు

Aarogyasri Scheme: వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించారు. కొత్త విధానాలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ కింద 3వేల 118 చికిత్సా విధానాలు వచ్చాయి. ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు వ్యవహరించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story