Coronavirus Updates in AP: ఏపీలో మరో 727 కరోనా పాజిటివ్ కేసులు
727 new coronavirus cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 727 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,962 శాంపిల్స్‌ని పరీక్షించగా 727 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 311 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 15,141. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 218. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6437కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 8,486 మంది చికిత్స పొందుతున్నారు.




