Tirupati: తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం

Tirupati: భారీగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు

Rama Rao
Published on: 23 Jan 2022 9:55 AM IST
70 Students and Staff Test Corona Positive Cases in Tirupati IIT Campus
X

తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో కరోనా కలకలం

Tirupati: ఏపీలోని విద్యాసంస్థల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో 70 మంది కరోనా బారిన పడ్డారు. ఏర్పేడు మండలంలోని ఐఐటీ శాశ్వత ప్రాంగణంలో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 70 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 40 మంది విద్యార్థులు కాగా, 30 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం వీరందరూ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవుల కోసం ఈ నెల మొదటి వారంలో ఐఐటీ క్యాంపస్ లోని 600 మంది విద్యార్థులు తమ సొంత ఊళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ఇంజినీరింగ్, ఎంటెక్, పీహెచ్ డీ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్స్ మాత్రమే క్యాంపస్ లో ఉన్నారు. క్యాంపస్ లో కొవిడ్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story