Tirupati: తిరుపతి ఐతేపల్లి రోడ్డుప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

Tirupati - Road Accident: ఆస్పత్రిలో చికిత్సపొందుతూ హైమావతి మృతి...

Shireesha
Published on: 6 Dec 2021 12:14 PM IST
7 Members Killed in Road Accident in Ithepalli Tirupati | AP Latest News
X

Tirupati: తిరుపతి ఐతేపల్లి రోడ్డుప్రమాదంలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య

Tirupati - Road Accident: తిరుపతి ఐతేపల్లి రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ హైమావతి మృతిచెందింది. నిన్న చిత్తూరు జిల్లా ఐతేపల్లి దగ్గర ప్రమాదవశాత్తు కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు.

ఇక అయిన వారందరూ ఆసుపత్రి మార్చురీలో ఉంటే అభం, శుభం తెలియని ఓ రెండేళ్ల చిన్నారి ఆసుపత్రి సిబ్బంది సంరక్షణలో చికిత్స పొందుతోంది. ఇక విధిని ఎదురించిందని సంతోషించాలో.. ముక్కుపచ్చలారకముందే తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను పొగొట్టుకుందని బాధ పడాలో తెలియడం లేదంటున్నారు ఆసుపత్రి సిబ్బంది.

Shireesha

Shireesha

Next Story