Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Srisailam: 7 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల

Jyothi
Published on: 18 Sept 2022 10:58 AM IST
7 Gates Of Srisailam Dam Lifted
X

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Srisailam: కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 76వేల 492 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2లక్షల 58వేల 458 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ఇప్పుడు 884 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ప్రాజెక్టులో 215 టీఎంసీలకు గాను 214 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది

Jyothi

Jyothi

Next Story