Corona Cases in AP: ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,996 కరోనా కేసులు.. నలుగురి మృతి

Corona Cases in AP: ఏపీలో కోవిడ్ కల్లోలం కంటిన్యూ అవుతోంది.

Arun Chilukuri
Published on: 18 Jan 2022 8:10 PM IST
6,996 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 18th January 2022
X

Corona Cases in AP: ఏపీలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,996 కరోనా కేసులు.. నలుగురి మృతి

Corona Cases in AP: ఏపీలో కోవిడ్ కల్లోలం కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఒక్కరోజే 7వేలకు చేరువలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38వేల 55 నమూనాలు పరీక్షించగా కొత్తగా 6వేల 996 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ వల్ల విశాఖలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో కరోనా బారి నుంచి నిన్న వెయ్యి 66 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం 36వేల 108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులో 15వందల 34 కేసులు నమోదయ్యాయి.


.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story