AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదు, 58 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 6వేల 952 కరోనా కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 12 Jun 2021 4:25 PM IST
6,952 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 12th June 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు నమోదు, 58 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 6వేల 952 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 58 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 18లక్షల 03వేల 074కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 11వేల 882 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 16లక్షల 99వేల 775కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 91‎వేల 417 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 9, తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, అనంతపురం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story