AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,670 కరోనా కేసులు, 58 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కొత్తగా 6వేల 770 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Venkata Chari
Published on: 13 Jun 2021 7:18 PM IST
6670 ‍New Coronavirus cases Reported in Andhra Pradesh Today 13 06 2021
X

కరోనా వైరస్ (ఫొటో ట్విట్టర్)

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,02,876 పరీక్షలు నిర్వహించగా.. 6,770కేసులు పాజిటివ్ గా తేలాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 18,09,844 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈరోజు 58 మంది కరోనాకు బలైపోయారు. దాంతో, ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11వేల 940 కి పెరిగింది.

24 గంటల వ్యవధిలో 12,492 మంది బాధితులు పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,12,267 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,637 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,04,50,982 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Venkata Chari

Venkata Chari

Next Story