ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు!

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 63,049 కరోనా టెస్టులు చేయగా 664 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 3 Dec 2020 7:09 PM IST
ఏపీలో కొత్తగా 664 కరోనా కేసులు!
X

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 63,049 కరోనా టెస్టులు చేయగా 664 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,70,076 కి చేరుకుంది. అయితే ఇందులో 6,742 యాక్టివ్ కేసులుండగా 8,56,320 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 835 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 11 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 7,014 కి చేరుకుంది.

కరోనా వలన చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి ఒక్కరు చొప్పున మరణించారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 29, చిత్తూరులో 105, ఈస్ట్ గోదావరిలో 67, గుంటూరులో 72, కడపలో 21, కృష్ణాలో 105, కర్నూల్ లో 19, నెల్లూరులో 34, ప్రకాశంలో 40, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 73, విజయనగరం 19, వెస్ట్ గోదావరి 70 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 1,02,29,745 కరోనా టెస్టులు నిర్వహించారు.


Krishna

Krishna

Next Story