AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 6:08 PM IST
6,341 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 18 06 2021
X

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల కంటే కోవిడ్‌ రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో లక్ష 7వేల 764 శాంపిల్స్ సేకరించగా అందులో 6 వేల 341 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుని 24గంటల్లో మరో 8 వేల 486 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 17 లక్షల 59 వేలు దాటింది. తూర్పుగోదావరి జిల్లాలో 12 వందల 47, చిత్తూరులో 919, పశ్చిమగోదావరి 731 చొప్పున అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో కరోనా పాజిటవ్‌ కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కోవిడ్‌తో మరో 57మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 12 వేల 224కి చేరింది. కోవిడ్ సోకి చిత్తూరులో 12మంది, గుంటూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళంలో ఐదురుగు, అనంతపురం, నెల్లూరు, విశాఖ, పశ్చిమగోదావరిలో ముగ్గురు, కర్నూలు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 వేల 629 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story