ఏపీలో కొత్తగా 6,235 కరోనా పాజిటివ్‌ కేసులు

Arun Chilukuri
Published on: 21 Sept 2020 6:07 PM IST
ఏపీలో కొత్తగా 6,235 కరోనా పాజిటివ్‌ కేసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,235 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 56,569 శాంపిల్స్‌ని పరీక్షించగా 6,235 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 10,501 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో 9, చిత్తూరు 7, విశాఖ 6, అనంతపురం 5, తూర్పు గోదావరి 4, గుంటూరు 4, నెల్లూరు 4, పశ్చిమ గోదావరి 4, కర్నూలు 3, కడప 2, ప్రకాశం 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 6,28,854. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,410 . ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,48,926కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 74,518 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,569 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 51, 60,700కు చేరుకుంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story