AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు, 20 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది.

Arun Chilukuri
Published on: 16 April 2021 7:08 PM IST
6,096 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 16th April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు, 20 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. ప్రతిరోజూ వెయ్యి చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఇక, ఇవాళైతే, రోజువారీ కేసులు 6వేలు దాటేశాయి. గత 24గంటల్లో 35వేల 962మందికి పరీక్షలు నిర్వహించగా 6వేల 96మందికి వైరస్ సోకింది. రోజువారీ కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేలు దాటేసింది.

ఇక, గత 24గంటల్లో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖలో ఇద్దరు చొప్పున మరణించారు. అనంతపురంలో 313, చిత్తూరులో 1024, తూర్పుగోదావరిలో 750, గుంటూరులో 735, కడపలో 243, కృష్ణాలో 246, కర్నూలులో 550, నెల్లూరులో 354, ప్రకాశంలో 491, శ్రీకాకుళంలో 534, విజయనగరంలో 489, పశ్చిమగోదావరిలో 68 కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story