మొంథా ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న 600 మందిని కాపాడిన అధికారులు

Cyclone Montha: మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 600 మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా రక్షించారు.

Arun Chilukuri
Published on: 29 Oct 2025 11:27 AM IST
మొంథా ఎఫెక్ట్..  సముద్రంలో చిక్కుకున్న 600 మందిని కాపాడిన అధికారులు
X

మొంథా ఎఫెక్ట్.. సముద్రంలో చిక్కుకున్న 600 మందిని కాపాడిన అధికారులు

Cyclone Montha: మొంథా’ తుపాను ప్రభావంతో ఒడిశా తీరంలో సముద్రంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 600 మంది మత్స్యకారులను స్థానిక అధికారులు సురక్షితంగా రక్షించారు. భారీ వర్షాల కారణంగా ముందుకు కదలలేకపోయిన 60 ట్రాలర్లను ఒడిశా యంత్రాంగం గోపాల్‌పుర్‌ ఓడరేవుకు తరలించింది.

మొంథా తుపాను కారణంగా ఒడిశాలోని గంజాం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, చేపల వేటకు వెళ్లిన ఏపీ మత్స్యకారులు ఛత్రపురం సమీపంలోని అర్జిపల్లి వద్ద సముద్రంలో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, మొత్తం 60 ట్రాలర్లను సురక్షితంగా గోపాల్‌పుర్‌ ఓడరేవులో లంగర్లు వేయించారు.

మత్స్యశాఖ ఉపసంచాలకుడు సంగ్రామ్ కర్ తెలిపారు, “మొత్తం 600 మంది మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాం. వారికి తగిన ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించాం. తుపాను ప్రభావం తగ్గే వరకు వారందరికీ అన్ని విధాలా సహాయం అందిస్తాం” అని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story