AP Corona Cases: ఏపీలో కొత్తగా 5,963 కరోనా కేసులు, 27 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Arun Chilukuri
Published on: 19 April 2021 6:23 PM IST
5,963 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 19th April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 5,963 కరోనా కేసులు, 27 మంది మృతి

AP Corona Cases: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 5వేల 963 మందికి కరోనా సోకగా వైరస్‌ బారిన పడి 27 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 68 వేలకు చేరింది. కరోనా నుంచి 9లక్షల 12వేల 510 మంది బాధితులు కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 48వేల 053 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తాజాగా నమోదైన మరణాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7వేల 437 కి పెరిగింది. కరోనా బారిన పడి కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందగా చిత్తూరు, నెల్లూరులో నలుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. అలాగే గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోగా కరోనాతో అనంతపురంలో ఒకరు మృతి చెందారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story