AP Corona Cases: గడిచిన 24 గంటల్లో 5,741 పాజిటివ్ కేసులు

AP Corona Cases: కొవిడ్‌తో మరో 53 మంది మృతి * 12,052కి చేరిన కరోనా మరణాలు

Sandeep Eggoju
Published on: 15 Jun 2021 6:38 PM IST
5,741 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 14 04 2021
X

Representational Image 

AP Corona Cases: ఏపీలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 96 వేల 153 కరోనా శాంపిల్స్ సేకరిస్తే.. అందులో 5 వేల 741 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో కోవిడ్ నుంచి కోలుకుని 10 వేల 567 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 17 లక్షలు దాటింది. చిత్తూరులో 830, తూర్పుగోదావరి 831, పశ్చిమగోదావరి లో 703, కృష్ణాలో 463, ప్రకాశంలో 463, శ్రీకాకుళంలో 428 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో కరోనా సోకి 53 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 12 వేల 52కి చేరింది. చిత్తూరులో 12, తూర్పుగోదావరి ఆరుగురు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖలో నలుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 75 వేల 134 యాక్టివ్ కేసులున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story