మేకప్‌తో మాయ చేసిన బామ్మ.. ఏకంగా మూడు పెళ్లిల్లు.. చివరికి ఆధార్ కార్డుతో..

Cheating: మేకప్‌తో మాయ చేసింది ఓ మాయలేడి. లేత వయస్సును ఆపాదించుకుంది.

Arun Chilukuri
Published on: 6 July 2022 2:55 PM IST
54 Years Old Woman Cheated Man For Second Marriage
X

మేకప్‌తో మాయ చేసిన బామ్మ.. ఏకంగా మూడు పెళ్లిల్లు.. చివరికి ఆధార్ కార్డుతో..

Cheating: మేకప్‌తో మాయ చేసింది ఓ మాయలేడి. లేత వయస్సును ఆపాదించుకుంది. పెళ్లి చూపుల్లో వరుడిని బుట్టలో వేసుకుంది. ఆమె అందానికి ఫిదా అయిన వరుడుఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వయస్సు 54 ఏళ్లని అవాక్కయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు తిరువళ్లురు జిల్లా పుదుప్పేట 65 ఏళ్ల ఇంద్రాణి అనే మహిళ కుమారుడి హరితో కలిసి నివాసం ఉంటుంది. అతడి వయసు 35 ఏళ్లు. హరికి ఇదివరకే వివాహం అయ్యింది. కానీ భార్యతో విబేధాల కారణంగా కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇంద్రాణి గత ఆరేళ్లుగా కుమారుడికి వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలో 2021లో తిరుపతి, పుత్తూరుకు చెందిన శరణ్య అనే మహిళ బ్రోకర్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఇంద్రాణి, ఆమె కుమారుడు హరి పెళ్లి చూపులకు వస్తున్నారని తెలియడంతో.. 54 ఏళ్ల వయసున్న శరణ్య వెంటనే బ్యూటీ పార్లర్‌కెళ్లి.. మేకప్‌ ద్వారా 34 ఏళ్ల యువతిలా మారి పెళ్లి చూపులకు కూర్చుంది. పెళ్లి చూపుల్లో శరణ్యను చూసి ఫిదా అయిపోయాడు హరి. అంతేకాదు 25 సవర్ల బంగారం ఎదురు కట్నం ఇచ్చి మరి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది రోజులకే శరణ్య అసలు రూపం బయటపడింది.

అత్త, భర్తకు చుక్కలు చూపించింది. ఆస్తి తన పేరు మీద రాయాలని, బీరువా తాళాలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అత్త ఇంద్రాణిని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయాలని భావించిన ఆమె భర్త ఆస్తి రాయాలంటే ఆధార్‌ కార్డు ఇవ్వాలని కోరారు. దీంతో శరణ్య తన ఆధార్‌ కార్డును భర్తకు ఇచ్చింది. అందులో కేరాఫ్‌ రవి అని రాసి ఉండటంతో అత్త ఇంద్రాణికి, భర్త గణేశ్‌కు అనుమానం వచ్చి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేపట్టడంతో అన్ని విషయాలు వెలుగు చేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story