ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు

Arun Chilukuri
Published on: 17 Dec 2020 5:29 PM IST
ఏపీలో కొత్తగా 534 కరోనా కేసులు
X

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 534 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కోవిడ్‌తో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం, పశ్చిమగోదావరి లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4వేల 454 యాక్టివ్ కేసులున్నాట్టు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు కోటి 10 లక్షల 65వేల 297 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 63వేల 821 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో.. 534 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు కోవిడ్‌తో 7వేలకు పైగా మంది మృతి చెందారు. 8లక్షల 72వేలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story