ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు
x
Highlights

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 520 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కోవిడ్‌తో మరో ఇద్దరు...

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 520 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కోవిడ్‌తో మరో ఇద్దరు మృతి చెందారు. కృష్ణా, విశాఖ‌లో ఒక్కొక్కరి చొప్పున మృతి చెందినట్టు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ అత్యధికంగా చిత్తూరులో 108 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కృష్ణా 71, గుంటూరు 64 మందికి మందికి కరోనా సోకింది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5వేల 236 యాక్టివ్ కేసులున్నాట్టు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు కోటి 6 లక్షల 99వేల 622 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 64వేల 425 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో.. 520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు కోవిడ్‌తో 7వేలకు పైగా మంది మృతి చెందారు. 8లక్షల 62వేలకు పైగా మంది కరోనా నుంచి కోలుకున్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories