ఏపీలో కొత్తగా మరో 5,120 పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా మరో 5,120 పాజిటివ్ కేసులు
x
Highlights

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 5,120 కొత్త కేసులు నమోదు అయ్యాయి....

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 5,120 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 66,796 శాంపిల్స్‌ని పరీక్షించగా 5,120 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 6,349 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలో 5, అనంతపురం 4, చిత్తూరు 4, కృష్ణా 4, విశాఖ 4, గుంటూరు 4, నెల్లూరు 3, కడప 2, కర్నూలు 2, పశ్చిమ గోదావరి 2 ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 7,31,532. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6,086. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,75,933కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 49,513 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో కొత్తగా 66769 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 6283009కు చేరుకుంది.
Show Full Article
Print Article
Next Story
More Stories