AP Corona Cases: ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు, 14 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 15 April 2021 5:19 PM IST
5,086 New Coronavirus Cases Reported in Andhra Pradesh on 15th April 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు, 14 మంది మృతి

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రతిరోజూ దాదాపు వెయ్యి చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఇక, ఇవాళైతే, రోజువారీ కేసులు 5వేలు దాటేశాయి. గత 24గంటల్లో 35వేల 741మందికి పరీక్షలు నిర్వహించగా 5వేల 86మందికి వైరస్ సోకింది. రోజువారీ కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 30వేలు దాటేసింది.

ఇక, గత 24గంటల్లో 14మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు మరణించారు. అలాగే, గుంటూరు, కడప, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. అనంతపురంలో 334, చిత్తూరులో 835, తూర్పుగోదావరిలో 450, గుంటూరులో 611, కడపలో 96, కృష్ణాలో 396, కర్నూలులో 626, నెల్లూరులో 223, ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విజయనగరంలో 432, పశ్చిమగోదావరిలో 31 కేసులు నమోదయ్యాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story